నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మే 4న చెన్నైలోని అవడిలోని ఒక పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం కారణంగా 45 నిమిషాల పాటు పరీక్ష పూర్తి చేయలేకపోయిన విద్యార్థులు పరీక్ష తిరిగి నిర్వహించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఇవాళ విచారించింది. కేంద్ర ప్రభుత్వం, NTA స్పందించే వరకూ ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.