ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళాకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. త్రివేణి సంగమమైన ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. ఇప్పటికే కేంద్రం భారీగా నిధులు విడుదల చేయగా యోగీ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దాదాపు 40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భద్రతకు పెద్దపీట వేస్తూ ఏర్పాట్లు జరుగుతున్నాయి.