హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న గుడిసెలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.