ఇటీవల యూపీలో ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చార్జ్‌మన్‌గా పనిచేస్తున్న రవీంద్రకుమార్‌ను ఏటీఎస్ అరెస్ట్ చేసింది. పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ 'నేహా శర్మ' హనీ ట్రాప్‌లో పడి.. అతడు భారత సైన్య ఆయుధాలు, గగన్‌యాన్ ప్రాజెక్టు, డ్రోన్‌ల సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంపాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నేహాతో, ఆమె ఐఎస్ఐకి పనిచేస్తున్నట్లు తెలిసినా అలాగే కొనసాగించాడు. ఏటీఎస్ అతడిపై ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది.