AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలపూడికి చెందిన అడపాల రవిపై దుండగులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. ముగ్గురు వ్యక్తులు రవి ఇంటి వద్దే కాపు కాసి చంపారు. దాడికి ముందు సీసీ టీవీ వైర్లను కట్ చేశారు. చిలకలపూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.