AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డీసీసీబీ బ్యాంకులోకి ఓ వ్యక్తి పెట్రోల్‌తో వచ్చి హల్‌చల్ చేశాడు. రోలుగుంట మండలం జానకిరామపురం పీఏసీఎస్ రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సొంత అవసరాలకు బ్యాంకు డబ్బులు వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దాంతో బ్యాంక్ అధికారులపై పెట్రోల్ పోస్తానంటూ 30 లీటర్ల పెట్రోల్ క్యాన్‌తో హల్‌చల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.