ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవ పడిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను ఇంటి పైకప్పు నుంచి తలకిందులుగా వేలాడదీసి కొట్టాడు. దీంతో సదరు మహిళ పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెను కిందకు దించి ప్రాణాలు కాపాడారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను ఇంటి పక్కన ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.