AP: అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయితీ డప్పుగుడ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన గడబంటు భీమన్న(46) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం నిందితుడు చిట్టపురి పొల్లు అనే వ్యక్తి అరకులోయ పీఎస్ లో లొంగిపోయాడు. హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని డిఎస్పీ షేక్ సహాబాజ్ అహమద్ తెలిపారు. ఇదిలా ఉండగా.. హత్యకు చేతబడే కారణమని గ్రామస్థులు, బంధువులు చెబుతున్నారు. నిందితుని కుటుంబంపై మృతుడు చిల్లంగి చేశాడని అనుమానంతోనే చంపేశాడని ఆరోపించారు.