రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడైంది. ఈ కేసులో న్యూజెర్సీకి చెందిన నిందితుడు హాది మతార్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. సల్మాన్ 1980లో రచించిన ‘ది సాతానిక్ వెర్సెస్’ వివాదాలకు కేంద్రబిందువైంది. 2022లో న్యూయార్క్‌లో ఆయన మాట్లాడుతుండగా హాది మతార్ ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సల్మాన్ రష్దీ శరీరంపై గాయాలు కాగా, ఓ కన్ను కోల్పోయారు.