ఎన్నో ఔషద గుణాలు ఉన్న కలబంద పంటకు 20 రోజుల వ్యవధిలో నీటి తడులు అందించాలి. స్ప్రింక్లర్ లేదా డ్రిప్ పద్ధతిని నీటి తడులు ఇచ్చేందుకు ఎంచుకోవాలి. గ్రబ్స్ భూగర్భ కాండం, మూలాలను దెబ్బతీస్తాయి. దీని నివారణకు హెక్టారుకు 60-70 కిలోల వేపపిండి లేదా 20-25 కిలోలు ఇవ్వాలి. వర్షాకాలంలో కాండం ఆకులపై తెగులు, మచ్చలు కనిపిస్తాయి. ఇది ఫంగల్ వ్యాధి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.