తెలంగాణ కులగణన సర్వేపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. ఎస్సీ వర్గీకరణలో కొన్ని లోపాలున్నాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని సూచించారు. మాదిగల జనాభా ప్రకారం రిజర్వేషన్ల వాటా రాలేదని.. రెండు శాతం తక్కువ వచ్చిందని వెల్లడించారు. 11 శాతం ఉండాల్సిన రిజర్వేషన్ల వాటా.. 9శాతంగా ఉందని తెలిపారు. 'మాకు ఎవరి వాటా వద్దు.. మా వాటా ఎవరికీ దోచిపెట్టొద్దు' అని మందకృష్ణ పేర్కొన్నారు.