మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ నేడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీరెన్ సింగ్ రాజీనామాపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. మణిపుర్‌లో హింస చెలరేగి ప్రాణనష్టం జరిగినప్పటికీ మోదీ బీరెన్ సింగ్ నే సీఎంగా కొనసాగించడానికి అనుమతించారని ఆరోపించారు. చివరికి ప్రజల ఒత్తిడి పెరగడంతోనే బీరెన్ సింగ్ రాజీనామా చేశారని విమర్శించారు.