ఏపీ వ్యాప్తంగా ఈ నెల 12న మన్యం జిల్లాల బంద్‌కు ఆదివాసి జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌లో ప్రతి గిరిజనుడూ పాల్గొనాలని జేఏసీ ఛైర్మన్ మొట్టడం రాజబాబు కోరారు. షెడ్యూల్ ప్రాంతంలోని 1/70 చట్టం సడలిస్తే పెట్టుబడిదారులు ముందుకు వస్తారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇటీవల వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా బంద్ జరుగుతోంది. పలు గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు పలికాయి.