మన్యంలో రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత

70చూసినవారు
మన్యంలో రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో రూ. కోటి విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం పాచిపెంట మండలం మాతమూరులో 671 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా సమాచారం రావడంతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అరకు నుంచి సాలూరుకు వెళ్తున్న 2 వాహనాల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్