దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 18 పాయింట్ల లాభంతో 77,886 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 23,763 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, జొమాటో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.