AP: రేషన్‌కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. చాలాచోట్ల దరఖాస్తుదారులను పెళ్లి కార్డు అడగటంపై ప్రజల నుంచి విమర్శలొస్తున్నాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణలో నెలకొన్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. భార్యాభర్తలు విడిపోయి ఏడేళ్లు దాటితే సింగల్ మెంబర్ కార్డులు ఇస్తామని చెప్పారు. అవసరమైతే రేషన్ కార్డుల దరఖాస్తు గడువును పొడిగిస్తామన్నారు.