చైనాలోని కూరగాయల మార్కెట్‌లో జరిగిన ఓ భారీ అగ్నిప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. చైనాలోని ఉత్తర ప్రావిన్స్ హెబీలోని కూరగాయల మార్కెట్‌లో శనివారం ఈ ప్రమాదం జరిగింది. మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంటకు పైగా శ్రమించి మంటలను ఆర్పారు.