TG: హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల పారిశ్రామికవాడలో దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.