ఏపీలో భారీ అగ్ని ప్రమాదం

83చూసినవారు
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం జైల్ రోడ్ సమీపంలో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దట్టగా పొగ అలుముకోవడంతో లోపలికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ఎస్బీఐకు వెనుక వైపు మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. మంటల్ని అదుపు చేసేందుకు రెండు బృందాలు వచ్చాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్