మహారాష్ట్ర వాషిమ్ జిల్లాలోని శిరపూర్ జైన్ బస్ స్టాండ్ ప్రాంతంలో ఉన్న నాలుగు పాత చెక్క దుకాణాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల మధ్య నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలడంతో పరిస్థితి మరింత తీవ్రతరం అయింది. ఈ ఘటనలో ఆస్తి నష్టం భారీగా సంభవించినట్టు తెలుస్తోంది. ఘటనకు గల కారణం ఇప్పటివరకు తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది సమీపంలోని బావి నుంచి నీటిని ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.