మాస్తాన్ సాయి కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నార్కోటిక్స్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. హార్డ్ డిస్క్‌లో డ్రగ్స్ వాడకం వీడియోలు క్షుణ్ణంగా పరిశీలించి డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. గతంలోనూ మస్తాన్ సాయి, లావణ్యపై డ్రగ్స్ కేసులు ఉన్నట్టు తేలింది. మస్తాన్ ‘డ్రగ్స్ ఎక్కడ నుంచి తీచ్చాడు, ఎక్కడ పార్టీలు నిర్వహించాడు, ఎంత మంది పాల్గొన్నారు’ అనే విషయాలపై ఫోకస్ చేశారు.