AP: కడప మేయర్ సురేష్‌బాబు రూ.36లక్షలు అవినీతికి పాల్పడినట్టు ఆరోపిస్తూ ప్రభుత్వం అనర్హత వేటువేయడంపై వైసీపీ స్పందించింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ మండిపడింది. తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న సంస్థ కార్పోరేషన్ కాంట్రాక్టులు చేసిందంటూ అభియోగం మోపిందని, ఎమ్మెల్యే మాధవికి కుర్చీ వేయలేదనే అక్కసుతో పదవి నుంచి తొలగించారని ఆరోపించింది. రాజకీయంగా ఎదుర్కోలేకనే తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.