మాజీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన ఎండీయూ ఆప‌రేట‌ర్లు

57చూసినవారు
మాజీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన ఎండీయూ ఆప‌రేట‌ర్లు
AP: వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ని రాష్ట్ర ఎండీయూ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) యూనియన్‌ కృష్ణా జిల్లా ప్రతినిధులు క‌లిశారు. ప్రజల వద్దకు ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించాలన్న గొప్ప ఉద్దేశంతో ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను ఏర్పాటు చేసి 9,260 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించి తమను ఆదుకున్నది మీరేనంటూ వైయస్‌ జగన్‌కు ఆపరేటర్లు ధన్యవాదాలు తెలిపారు. ఎండీయూ ఆపరేటర్లకు వైసీపీ అండగా ఉంటుందని జగన్‌ భరోసానిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్