AP: భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వైసీపీకి అనుకూలంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో మీడియా స్వేచ్ఛను హరించారని, ఇప్పుడు భావ ప్రకటనా స్వేచ్ఛ పేరిట వైసీపీ అనుకూలంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, వ్యక్తిగత హనన వ్యాఖ్యలు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ కిందికి రాదని గుర్తించాలన్నారు.