అమ‌ర్‌నాథ్ యాత్రికులకు రేపటి నుంచి మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ల జారీ

53చూసినవారు
అమ‌ర్‌నాథ్ యాత్రికులకు రేపటి నుంచి మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ల జారీ
జమ్మూకశ్మీర్‌లో కొలువైన అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఇటీవల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా తాజాగా ఏపీ ప్రభుత్వం మెడికల్ సర్టిఫికెట్ల జారీకి అనుమతి ఇచ్చింది. యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించాలి. ఈ క్రమంలో బుధవారం నుంచి గుంటూరు జీజీహెచ్‌లో మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు వైద్య అధికారి తెలిపారు. ఇతర వివరాలకు 99637 66638 ఫోన్ నెంబ‌ర్‌లో సంప్ర‌దించాల‌ని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్