AP: కూటమి ప్రభుత్వం మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులు గడువు పెంచాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తుండగా.. వాటిలో ఎలాంటి మార్పు ఉండదని తాజాగా మంత్రి లోకేశ్ తెలిపారు. కొంతమంది గడువు పెంచాలని కోరుతున్న మాట వాస్తవమేనని, కానీ సిలబస్‌ను మేము డిసెంబర్ నెలలోనే ఇచ్చామని, ఆ గడువు ఏడు నెలలు పూర్తయిందని లోకేశ్ చెప్పారు. దీంతో గడువు పెంపుపై ఎలాంటి మార్పు లేదని క్లారిటీ వచ్చేసింది.