AP: జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక ‘కీ’లను శనివారం విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వెబ్‌సైట్ https://apdsc.apcfss.inలో కీ, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 12వ తేదీలోపు ‘కీ’పై అభ్యంతరాలు తెలపాలని అధికారులు పేర్కొన్నారు. కాగా, జూన్ 6 నుంచి 28 వరకు జరిగిన పరీక్షల ‘కీ’, రెస్పాన్స్ షీట్లను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు.