AP: జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించనున్నారు. మరో 5 రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో విద్యాశాఖ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్సుంది. కాగా, జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించారు.