అల్బేనియా రాజధాని టిరానాలో శుక్రవారం జరిగిన ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సుకు విచ్చేసిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి అల్బేనియా ప్రధాని ఎడీ రమా అందించిన స్వాగతం ఆసక్తికరంగా మారింది. వర్షం పడుతున్న సమయంలో మోకాలుపై కూర్చుని ఆమెకు స్వాగతం పలికి ఆకట్టుకున్నారు. దీంతో మెలోనీ ఫిదా అయ్యారు. అలాగే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌కు మెలోనీ బ్రో హగ్ ఇవ్వడం కూడా సభా వేదికపై ఆకర్షణగా నిలిచింది.