AP: రాష్ట్రంలో స్వయం సహాయక మహిళా సంఘాల తరహాలో పురుషుల పొదుపు సంఘాలు ఏర్పాటు కానున్నాయి. అసంఘటిత కార్మికుల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం ఈ సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో 3,000 సంఘాలను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించనున్నారు. భవన నిర్మాణ కార్మికులు, గిగ్ కార్మికులు, ఆటో, రిక్షా, తోపుడుబళ్ల కార్మికులు దీనికి అర్హులు. వీరితో పాటు వృద్దులు, పిల్లల సంరక్షణ కేంద్రాలు, ఇళ్లలో పని చేసే వారు అర్హులు.