AP: పదో తరగతి విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెలవుల్లోనూ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు.. 2 రెండో శనివారాలు, 6 ఆదివారాలు ఉన్నాయి. ఈ రోజుల్లో విద్యార్థులకు సెలవు ఉంటుంది. ఈ సెలవుల్లో కూడా విద్యార్థులకు భోజనం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.