AP: మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యకారులకు శనివారం కీలక సూచనలు చేశారు. సముద్రంలో అర్ధరాత్రి నుంచి తిరిగి చేపలవేట మొదలు కానుంది. రెండు నెలల వేట నిషేధ సమయం ఇవాల్టితో ముగియనున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో చేపల వేట సాగించేందుకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వారికి శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చేపల వేట సాగించాలని మంత్రి సూచించారు.