ఏపీలోని విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి రిజర్వాయరులో సాహస జలక్రీడలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. దీంతో జిల్లా పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడింది. జలాశయంలో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలతో బోటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పిపిపి విధానంలో పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రిజర్వాయరు నిర్మాణంలో గొర్రిపాటి బుచ్చి అప్పారావు విశేషకృషి చేశారని మంత్రి పేర్కొన్నారు.