AP: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)తో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలోని ఉద్యోగులు గౌరవ వేతనం కోసం గత ప్రభుత్వ హయాంలో 21 రోజులు సమ్మె చేశారని ఆయన గుర్తుచేశారు. ఆ సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సోమవారం ఆ ఉత్తర్వులు జారీ అయినట్లు లోకేశ్ తెలిపారు.