AP: మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో నేడు జెండా ఊపి ప్రారంభించారు. ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈ ఉచిత విద్యుత్ బస్సు సర్వీసులు నడువనున్నాయి. ఎయిమ్స్ కు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు .. పానకాలస్వామి ఆలయానికి ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు ఉచిత విద్యుత్ బస్సును నడపనున్నారు.