ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్లేస్‌మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలపాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఈ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చల తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంస్కరణలు అమలు చేసే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని లోకేశ్ తెలిపారు.