AP: మంత్రి నారా లోకేశ్ క్యాన్సర్ బాధితుడికి అండగా నిలిచారు. గుంటూరు జిల్లా ధర్మకోట వాసి బ్రహ్మయ్య క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తనను ఆదుకోవాలని ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్‌ను బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు కోరారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సీఎం సహాయనిధి ద్వారా రూ.3 లక్షల సాయం మంజూరు చేశారు.