AP: పోలీసులపై మంత్రి నారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ క్రమంలో కార్యాలయంలో పోలీసులు ఎక్కువ ఉండటంపై లోకేశ్ సీరియస్ అయ్యారు. బందోబస్తు పేరుతో పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కార్యాలయానికి ప్రతిరోజూ కార్యకర్తలు వస్తారని, వారిని పోలీసులు ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు.