AP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఈ మేరకు 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. కోటంరెడ్డి ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారని అందులో పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ అని లోకేశ్ రాసుకొచ్చారు.