AP: గుంటూరు జిల్లాలో జరిగిన డీఆర్సీ సమావేశంలో మంత్రి నారా లోకేష్‌కు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. మంత్రి లోకేష్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్‌ను అధికారులు ఉద్యోగుల కాళ్ల వద్ద పెట్టినట్లు సమాచారం. వేదికపై ఉండాల్సిన నేమ్ ప్లేట్‌ను కాళ్ల వద్ద పెట్టడంతో కలెక్టరేట్ ఉద్యోగులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.