ఏపీ మంత్రి నారా లోకేష్ శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇటీవల అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుటుంబ సమేతంగా ఢిల్లీకి రావాలని నారా లోకేష్‌కి ప్రధాని ,మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో లోకేష్ కుంటుంబంతో ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారు.