ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసానితో కలిసి వైష్ణవ్ ను కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సమష్టి కృషితోనే విశాఖ ఉక్కును కాపాడుకోగలిగామని కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలతో నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగించాలని సూచించారు.