ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆలయాల పవిత్రను కాపాడతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాతి కట్టడాలపై రంగులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రంగులు వేయడంతో పవిత్రత కోల్పోయయాని, ఆ రంగుల్ని మార్చేస్తామని.. దీని కోసం ఎంత ఖర్చైనా పర్లేదన్నారు. రాష్ట్రంలో పలు ఆలయాల పునర్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. శివరాత్రికి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.