AP : పెద్దవాళ్లంటే వైసీపీ అధినేత జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 'జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది. రూ.20 వేల కోట్లు అప్పు చేసిన పెద్ద మనిషి ఆ డబ్బులతో ఏం చేశారో చెప్పాలి' అని సంధ్యారాణి మండిపడ్డారు.