ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి సవిత

75చూసినవారు
ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి సవిత
AP: వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు ‘తల్లికి వందనం’ నిధులు దుర్వినియోగమైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి సవిత అన్నారు. నిరూపించలేకపోతే ఎమ్మెల్యే పదవికి జగన్‌ రాజీనామా చేయగలరా? అని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెడతామని చెప్పామని.. చేసి చూపించామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్