తిరుపతి జిల్లా చంద్రగిరి బీసీ హాస్టల్‌లో విద్యార్థినులకు అస్వస్థతపై మంత్రి సవిత ఆరా తీశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌తో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కాగా, సరిగా ఉడకని అన్నం తిని 27 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.