AP: కాకినాడ జిల్లా తునిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంత్రులు నారా లోకేశ్, రామ్ ప్రసాద్ రెడ్డి స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.