AP: తల్లికి వందనం నిధులపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి సవిత తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు 'తల్లికి వందనం' నిధులు దుర్వినియోగమైనట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆమె సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఇచ్చిన హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం అమలు చేశామన్నారు.