హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ సుందరీమణులు శనివారం రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనకు వచ్చారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో విదేశీ అతిథులందరికీ సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం లభించింది. ఫిల్మ్‌సిటీలో 108 దేశాల అందగత్తెలు సందడి చేశారు. ఫిల్మ్‌సిటీ సైనేజ్ వద్ద గ్రూప్ ఫొటోకు సుందరీమణులు ఫోజులిచ్చారు. తర్వాత ఫిల్మ్‌సిటీ అందాలను 108 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు తిలకించారు.