‘తల్లికి వందనం’ తుది జాబితాల్లో పొరపాట్లు

54చూసినవారు
‘తల్లికి వందనం’ తుది జాబితాల్లో పొరపాట్లు
AP: ‘తల్లికి వందనం’ తుది జాబితాలో అధికారులు పొరపాట్లను గుర్తించారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో సుమారు 192 మంది పిల్లలకు తల్లి కాలమ్‌లో ఇద్దరి పేర్లు నమోదవ్వడం కలకలం రేపింది. ప్యాపిలి సచివాలయంలో ధర్మవరం మౌనిక 96 మంది పిల్లలకు తల్లిగా చూపగా.. దాసరి శోభకు 96 మంది పిల్లలు ఉన్నట్లు చూపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి పొరపాట్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వాటిని సరి చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్